బెల్లం పరమాన్నం

Directions

  1. 1గిన్నెలోనికి ఒక కప్పు బియ్యాన్ని వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసుకుని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
  2. 2పది నిమిషాల తర్వాత ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల పాలు, ఒక కప్పు నీళ్లు పోసుకుని ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు కూడా మరగనివ్వాలి.
  3. 3పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
  4. 4రైస్ ని ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
  5. 5ఇప్పుడు ఒక గిన్నెలోనికి కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పుని, ఎండు ద్రాక్షని కూడా వేయించుకుని పక్కకు తీసుకోవాలి.
  6. 6ఇదే గిన్నెలోనికి రెండు కప్పుల వరకు తురుముకున్న బెల్లాన్ని, పావు కప్పు నీళ్లు పోసుకుని బెల్లం అంతటిని కూడా కరగనివ్వాలి.
  7. 7బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎటువంటి పాకం కూడా తీయాల్సిన అవసరం లేదు. ఇందులోనే రెండు దంచిన ఇలాచిని కూడా వేసి కలిపి, ముందుగా ఉడికించుకున్న అన్నం లోనికి ఇలా ఫిల్టర్ చేసి వేసి కలుపుకోవాలి.
  8. 8ఇందులోనికి ముందుగానే వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షను కూడా వేసేసి కలిపేసుకున్నామంటే కమ్మగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోతుంది.

Ingredients

  • 1 కప్పు బియ్యం
  • 3 కప్పులు పాలు
  • 1 కప్పు నీళ్లు
  • నెయ్యి
  • జీడిపప్పు
  • ఎండు ద్రాక్ష
  • 2 కప్పుల తురుముకున్న బెల్లం
  • 0.25 కప్పు నీళ్లు
  • 2 దంచిన ఇలాచి

Equipment

గిన్నెచెంచాగరిటెస్టవ్వడపోత

Tips

  • పాలు విరిగిపోకుండా ఎంత సేపైనా కూడా గట్టిపడకుండా రుచిగా చేసుకోవచ్చు.
  • బెల్లం కరిగితే సరిపోతుంది, ఎటువంటి పాకం తీయాల్సిన అవసరం లేదు.