మైసూర్ బొండాలు

2h 3m
Serves 12
instagram.com

Directions

  1. 1ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక కప్పు పెరుగు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక స్పూన్ పంచదార, కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం పెరుగులో బాగా కలిసేంతవరకు కలుపుకోండి.
  2. 2తర్వాత ఒక పావు స్పూన్ దాకా వంట సోడా, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోనే బాగా కలుపుకోవాలి.
  3. 3పెరుగులో ఎయిర్ బబుల్స్ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి.
  4. 4అవసరం అయితే కొంచెం వాటర్ వేసుకొని ఇలా పిండిని వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేస్తూ కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు నానబెట్టుకోండి.
  5. 5చట్నీ కోసం మిక్సీ జార్ లో కొబ్బరి, పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి.
  6. 6తర్వాత పోపు వేసుకొని పోపు మొత్తం చట్నీలో బాగా కలిసేంతవరకు కలుపుకొని పక్కన పెట్టుకున్నామంటే మైసూర్ బొండాలకి చట్నీ కూడా రెడీ అయిపోతుంది.
  7. 7పిండి 10 నిమిషాలు నానిన తర్వాత మరలా ఒకసారి బాగా ట్యాప్ చేసుకొని ఆయిల్ లో మైసూర్ బొండాల లాగా రౌండ్ గా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి.

Ingredients

  • 1 cup పెరుగు
  • 1 tsp ఉప్పు
  • 1 spoon పంచదార
  • 1 spoon ఆయిల్
  • 0.25 spoon వంట సోడా
  • 1 spoon జీలకర్ర
  • 1 cup మైదా
  • 1 cup గోధుమ పిండి
  • 1 నీరు
  • 1 కొబ్బరి
  • 1 పల్లీలు
  • 1 పుట్నాలు
  • 1 పచ్చిమిర్చి
  • 1 అల్లం
  • 1 వెల్లుల్లి
  • 1 ఉప్పు

Equipment

mixing bowlwhiskblenderfrying pan