చికెన్ మసాలా పొడి

Directions

  1. 1అడుగు మందపాటి కడాయిలో పావు కిలో ధనియాలు వేసుకోండి.
  2. 2ఇందులో 50 గ్రాముల లవంగాలు వేయండి.
  3. 350 గ్రాముల దాల్చిన చెక్క వేయండి.
  4. 450 గ్రాముల జీలకర్ర వేయండి.
  5. 550 గ్రాముల యాలకులు వేయండి.
  6. 65 గ్రాముల నల్ల యాలకులు వేయండి.
  7. 710 గ్రాముల మిరియాలు వేయండి.
  8. 810 గ్రాముల అనాస పువ్వు వేయండి.
  9. 95 గ్రాముల జాపత్రి వేయండి.
  10. 1050 గ్రాముల శొంఠిని దంచి వేసుకోండి.
  11. 115 గ్రాముల బిర్యానీ ఆకును కట్ చేసి వేసుకోండి.
  12. 12దాల్చిన చెక్కను చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి.
  13. 1330 గ్రాముల ఎండు మిర్చిని వేసుకోండి.
  14. 1410 గ్రాముల కసూరీ మేతి వేయండి.
  15. 15గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి.
  16. 1650 గ్రాముల జీడిపప్పు వేయండి.
  17. 17ఒక టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాలు మసాలా దినుసులు మాడకుండా, లోపలి వరకు చక్కగా రోస్ట్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించండి.
  18. 18మసాలా దినుసులు సగం పైన వేగిన తర్వాత 100 గ్రాముల గసగసాలు వేసుకోండి.
  19. 19ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించండి.
  20. 20గసగసాలు వేసాక ఒక రెండు మూడు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి.
  21. 21ఈ మొత్తాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్‌గా పొడి చేసేసుకోండి.
  22. 22పొడి చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మొత్తం బాగా కలిపేయండి.

Ingredients

  • 250 g ధనియాలు
  • 50 g లవంగాలు
  • 50 g దాల్చిన చెక్క
  • 50 g జీలకర్ర
  • 50 g యాలకులు
  • 5 g నల్ల యాలకులు
  • 10 g మిరియాలు
  • 10 g అనాస పువ్వు
  • 5 g జాపత్రి
  • 50 g శొంఠి
  • 5 g బిర్యానీ ఆకు
  • 30 g ఎండు మిర్చి
  • 10 g కసూరీ మేతి
  • 1 గుప్పెడు కరివేపాకు
  • 50 g జీడిపప్పు
  • 1 tbsp సోంపు
  • 100 g గసగసాలు
  • 1 tsp పసుపు
  • 1 tbsp ఉప్పు

Equipment

అడుగు మందపాటి కడాయిమిక్సీ జార్

Tips

  • మసాలా దినుసులు మాడితే ఫ్లేవర్ మారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా రోస్ట్ చేసుకోండి.
  • గసగసాలు త్వరగా మాడిపోతాయి కాబట్టి చివరిలో వేసి వేయించుకోవాలి.
  • సాల్ట్ వల్ల మసాలా పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, తొందరగా పాడవ్వదు.
  • ఫ్లేవర్స్ పోకుండా ఎయిర్ టైట్‌గా స్టోర్ చేసుకోవాలి.
  • కేజీ చికెన్‌కి ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి సరిపోతుంది.
  • ఈ మసాలాను మటన్ కర్రీస్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు.