టేస్టీ చికెన్ కర్రీ

15m
Serves 1
youtube.com

Directions

  1. 1కట్ చేసిన చికెన్ లో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి.
  2. 2నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోండి.
  3. 3స్టౌ ఆన్ చేసి పాన్ లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి.
  4. 4ఆయిల్ వేడి అయ్యాక రెండు బిర్యాని ఆకులు వేసి, సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయండి.
  5. 5ఉల్లిపాయలు అర్ధం ఫ్రై అయ్యాక మూడు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేయండి.
  6. 6ఒక టేబుల్ స్పూన్ తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి.
  7. 7ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన టమాటో వేసి ఫ్రై చేయండి.
  8. 8రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాక పావు టీ స్పూన్ పసుపు వేసి కలపండి.
  9. 9శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను వేసి ఒకసారి బాగా కలపండి.
  10. 10మూత పెట్టి మూడు నాలుగు నిమిషాలు ఉడికించండి.
  11. 11మూడు నిమిషాల తర్వాత చికెన్ నుండి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది.
  12. 12రెండు టేబుల్ స్పూన్ల కారం లేదా మీ రుచికి సరిపడా వేసి, అర్ధ టీస్పూన్ చికెన్ మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, రెండు టీ స్పూన్లు ధనియాల పొడి వేసి కలపండి.
  13. 13కట్ చేసిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి కలపండి.మూత పెట్టి ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి.
  14. 14పదిహేను నిమిషాల తర్వాత చికెన్ ముక్కలను గంటతో ప్రెస్ చేసి చూడండి బాగా ఉడికిందో లేదో.
  15. 15చివరిగా తరిగిన కొత్తిమీర, అర్ధ టీ స్పూన్ గరం మసాలా వేసి కలపండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయండి.

Ingredients

  • 0.5 kg chicken
  • 1 tsp salt
  • 3 tbsp oil
  • 2 biriyani leaves
  • 1 cup chopped onion
  • 1 pinch salt
  • 3 chillies
  • 1 tbsp fresh ginger garlic paste
  • 1 chopped tomato
  • 0.25 tsp turmeric
  • 2 tbsp chilli powder
  • 0.5 tsp chicken masala powder
  • 2 tsp coriander powder
  • 1 handful chopped coriander
  • 1 handful mint
  • 1 handful curry leaves
  • 0.75 glass water
  • 0.5 tsp garam masala

Equipment

panbowlwooden spoon