1ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, మిరియాలపొడి, కొంచెం నీరు వేసి కలపండి.
2మూడు కోడిగుడ్లను అందులో పగలగొట్టి బాగా కలపండి.
3చిన్న గిన్నెలో నూనె రాసుకొని, గుడ్ల మిశ్రమాన్ని వేసి, చాలా తక్కువ మంట మీద ఐదు నిమిషాలు ఉడికించండి.
4చల్లారబెట్టి చిన్న ముక్కలుగా కోసి గిన్నెలో వేసుకోండి.
5అందులో కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలపండి.
6అరచెంచా కార్న్ ఫ్లోర్, కొంచెం నీరు వేసి కలపండి.
7నూనెలో వేసి మీడియం మంట మీద మూడు నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
8ఇంకో గిన్నెలో కొంచెం నూనె వేసి, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజీ వేసి రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లో వేయించండి.
9వేయించిన గుడ్డు ముక్కలు వేసి ఒక నిమిషం వేయించండి.
10ఉడికించిన అన్నం, కొంచెం ఉప్పు, కారం, మిరియాలపొడి, తల మిరియాలపొడి, గరం మసాలా, శెజ్వాన్ సాస్, సోయా సాస్, వెనిగర్ వేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద వేయించండి.